సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న విజయ్ దేవరకొండ
Advertisement
ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్ ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన పూరి జగన్నాథ్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు.

టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆహార నియమాలు పాటిస్తున్నాననీ, జిమ్ లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నానని విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పాడు. 'అర్జున్ రెడ్డి'ని మించి తన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని అన్నాడు. ఇక ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ ను పెంచడం కోసం, విజయ్ దేవరకొండ జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ డేట్స్ కోసం పూరి ట్రై చేస్తున్నాడు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి మరి.
Sat, Nov 02, 2019, 12:47 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View