'విక్రమార్కుడు' తరహా పోలీస్ ఆఫీసర్ గా రవితేజ
Advertisement .b
మొదటి నుంచి కూడా రవితేజ తన సినిమాల్లో యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. ఈ కారణంగానే మాస్ ఆడియన్స్ లో ఆయన క్రేజ్ అలా నిలబడిపోయింది. త్వరలో ఆయన 'డిస్కోరాజా' ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనుల్లో వున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన గోపీచంద్ మలినేనితో పట్టాలెక్కించనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'డాన్ శీను' .. 'బలుపు' సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో కావాల్సినంత కామెడీ కనిపిస్తుంది.

తాజా చిత్రంలో మాత్రం కామెడీ అనేది ఉండదట. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్న ఈ సినిమా, పూర్తి యాక్షన్ మూవీగా సాగుతుందని సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే, 'విక్రమార్కుడు' సినిమాలో మాదిరిగా ప్రతినాయకుడు ఎంతటివాడైనా కొమ్ములు వంచే ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ జోడీగా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Sat, Nov 02, 2019, 12:15 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View