దిల్ రాజుకు ఓకే చెప్పిన పవన్ కల్యాణ్?
Advertisement .b
రాజకీయాలతో బిజీగా ఉంటున్న పవన్ కల్యాణ్... చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన మళ్లీ నటించబోతున్నారనే వార్తలు ఈ మధ్యన బాగా వినిపిస్తున్నాయి. మరోవైపు, ఓ విశ్వసనీయ సమాచారం మేరకు పవన్ మళ్లీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజుతో సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.

'పింక్' చిత్రం బాలీవుడ్ లో విజయవంతమైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తమిళ వర్షన్ లో అజిత్ పోషించాడు. అదే పాత్రను ఇప్పుడు తెలుగులో పవన్ చేయబోతున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
Sat, Nov 02, 2019, 11:05 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View