50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'ఖైదీ'
Advertisement .b
కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీకి, 'ఖైదీ' ఫలితం ఊరటనిచ్చింది. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా కార్తీకి విజయాన్ని తెచ్చిపెట్టింది. గత నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విజయ్ 'విజిల్' పోటీని తట్టుకుని నిలబడింది. వారం రోజులకి పైగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా దూసుకుపోతోంది.

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఒక్క తమిళనాడులోనే 25 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇలా దేశవ్యాప్తంగా 40 కోట్లకి పైగా .. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. కొత్తగా విడుదలైన సినిమాల పోటీని తట్టుకుని కూడా ఈ సినిమా రన్ అవుతుండటం విశేషం.
Sat, Nov 02, 2019, 11:46 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View