'ఖైదీ' దర్శకుడితో 'విజిల్' హీరో విజయ్
Advertisement .b
కార్తీ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఖైదీ' సినిమా, అటు తమిళంలోనూ .. ఇటు తెలుగులోను భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఇటీవలే 'బిగిల్' సినిమాతో తన అభిమానులను అలరించిన విజయ్, తాజాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. తాజా షెడ్యూల్ ను ఈ రోజున ఢిల్లీలో మొదలుపెట్టారు. 40 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సీన్లను చిత్రీకరించనున్నారు. సినిమాకి హైలైట్ గా నిలిచే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, వచ్చే వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Sat, Nov 02, 2019, 10:23 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View