సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement
  *  'మొదటి నుంచీ నేను కష్టపడడాన్నే అలవాటు చేసుకున్నాను' అంటోంది అందాలతార సమంత. 'ఎవరైనా సరే కష్టపడి పనిచేస్తే కనుక తప్పకుండా ఫలితం వుంటుంది. అయితే ఒక్కోసారి కాస్త ఆలస్యం కావచ్చు. దానికి మనం అప్సెట్ కాకూడదు. నేను దీనినే నమ్ముతాను. అందుకే, మొదటి నుంచీ నేను కష్టాన్నే నమ్ముకున్నాను' అని చెప్పింది.  
*  ప్రముఖ నటి అమల అక్కినేని తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోకి తల్లిగా అమల కీలక పాత్ర పోషిస్తున్నారు.
*  తమిళ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన 'విజిల్' చిత్రం దీపావళికి విడుదలై ఇక్కడ కూడా ప్రేక్షకాదరణను పొందుతోంది. ఈ క్రమంలో తొలివారంలో రెండు తెలుగు రాష్ట్రాలలోను కలిపి ఈ చిత్రం మొత్తం 9 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు సమాచారం. దీంతో పదిన్నర కోట్లకు తెలుగు హక్కులను కొన్న నిర్మాత త్వరలో సేఫ్ జోన్ లో పడతాడని అంటున్నారు.
*  గతంలో 'మనసంతా నువ్వే', 'నేనున్నాను' వంటి హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు వీఎన్ ఆదిత్య ఇప్పుడు మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా రూపొందించే ఈ చిత్రానికి 'వాళ్లిద్దరి మధ్య' అనే టైటిల్ని నిర్ణయించారు.  
Sat, Nov 02, 2019, 07:29 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View