శర్వానంద్ చిత్రంలో కీలక పాత్రలో అమల... సెకండ్ షెడ్యూల్ ప్రారంభం
Advertisement .b
యువ హీరో శర్వానంద్ కొత్త చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమల అక్కినేని ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. పెళ్లిచూపులు ఫేమ్ రీతూవర్మ ఇందులో కథానాయిక. శ్రీకార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. సీనియర్ నటుడు నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ తదితరులు ఈ సినిమాలో ఇతర తారాగణం. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, శర్వా చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు రాస్తున్నారు. ఈ సినిమా 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
Fri, Nov 01, 2019, 05:29 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View