గరిట తిప్పిన మోహన్ లాల్.. ప్రశంసలతో ముంచెత్తిన అతిథి!
Advertisement
మలయాళ నటుడు సూపర్ స్టార్ మోహన్ లాల్ తన నలభీమపాకంతో అదరగొట్టారు. తనకు నటనే కాకుండా రుచికరమైన వంటలు వండే కళ కూడా ఉందని చాటారు. ఇటీవల తన స్నేహితుడు పృథ్వీరాజ్, అతని భార్య సుప్రియా మీనన్ లను తన ఇంటికి భోజనానికి రమ్మని మోహన్ లాల్ ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో మోహన్ లాల్ తన భార్య సుచిత్రకు విశ్రాంతినిచ్చి చక్కటి మెనూతో మంచి వంటకాలను స్వయంగా తయారు చేశారు. ఈ విందుకు పృథ్వీరాజ్ హాజరుకాలేకపోయారు కానీ, ఆయన భార్య సుప్రియా మీనన్ మాత్రం విచ్చేశారు. ఆ విందారగించిన అనంతరం సుప్రియ.. విందు అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన భావాలను పంచుకున్నారు.

‘ఛెఫ్ గా మారిన మోహన్ లాల్ మా కోసం ఎంతో కమ్మని భోజనాన్ని తయారు చేసి స్వయంగా వడ్డించారు. ఈ అద్భుతమైన విందును, అనందమైన క్షణాలను పృథ్వీ మిస్సయారు’ అని సుప్రియ పేర్కొన్నారు. అంతేకాక, మోహన్ లాల్ దంపతులతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.
Fri, Nov 01, 2019, 03:47 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View