బిగ్ బాస్ ఫైనల్లో డ్యాన్సులతో అదరగొట్టనున్న ముగ్గురు హీరోయిన్లు
Advertisement .b
బిగ్ బాస్ సీజన్-3 చివరి దశకు చేరుకుంది. నవంబర్ 3న ఈ రియాల్టీ షో ముగుస్తోంది. ఫైనల్స్ బరిలో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. మరోవైపు, ఫైనల్స్ ను గ్రాండ్ గా జరిపేందుకు ఈ షో యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అంతేకాదు, హీరోయిన్లు నిధి అగర్వాల్, క్యాథరిన్, అంజలి ఈ కార్యక్రమంలో డ్యాన్స్ లతో అలరించనున్నట్టు సమాచారం. కంటెస్టెంట్లలో రాహుల్ ప్రస్తుంతం టాప్ లో కొనసాగుతున్నాడు. అతనే విజేతగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ ఫినాలే ప్రారంభంకానుంది.
Fri, Nov 01, 2019, 10:03 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View