' రాగల 24 గంటల్లో' విడుదల తేదీ ఖరారు
Advertisement
'ఢమరుకం' శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా .. శ్రీనివాస్ కానూరు నిర్మాతగా 'రాగల 24 గంటల్లో' సినిమా నిర్మితమైంది. ఈషా రెబ్బ .. సత్యదేవ్ .. గణేశ్ వెంకట్రామన్ .. ముస్కాన్ సేథీ .. శ్రీరామ్ ప్రధాన పాత్రలుగా ఈ సినిమా రూపొందింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇంట్రెస్టింగ్ టైటిల్ తోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, టీజర్ తో మరింతగా అంచనాలు పెంచింది. ఈ సినిమాలో ఈషా రెబ్బా పాత్రకి ప్రాధాన్యత ఎక్కువని తెలుస్తోంది. గ్లామర్ పరంగా .. నటనపరంగా ఈషాకి వంకబెట్టవలసిన పనిలేదు. అలాంటి ఈషా రెబ్బా కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
Fri, Nov 01, 2019, 09:43 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View