సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
Advertisement
 *  రానా కథానాయకుడుగా రూపొందే 'విరాటపర్వం 1992' చిత్రం కోసం కథానాయిక సాయిపల్లవి ఇప్పుడు గన్ ఫైరింగ్, బాంబులు వేయడం వంటి వాటిల్లో శిక్షణ తీసుకుంటోంది. ఆమెకు మాజీ నక్సలైట్ ద్వారా ఈ ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె నక్సలైట్ ఉద్యమంలో చేరే జానపద కళాకారిణి పాత్రను పోషిస్తోంది.
*  గతేడాది రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రం తమిళ రీమేక్ హక్కులను నటుడు, దర్శకుడు లారెన్స్ సొంతం చేసుకున్నాడు. తను హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో దీనిని తమిళంలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట.
*  అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతోంది. అక్కడి ఎడారి ప్రాంతంలో ప్రస్తుతం అఖిల్ పాల్గొనే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.    
Fri, Nov 01, 2019, 07:24 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View