రకుల్ ప్రీత్ సోదరుడు హీరోగా 'నిన్నే పెళ్లాడతా'

Advertisement .b
తెలుగు .. తమిళ భాషల్లో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. తెలుగు చిత్రపరిశ్రమకి తన సోదరుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆమె సోదరుడు 'అమన్' హీరోగా మొత్తానికి ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాకి 'నిన్నే పెళ్లాడతా' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

రమ్య - శ్రీధర్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు యాక్షన్ సీన్లు .. రెండు పాటల మినహా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఈ సినిమా ద్వారా 'సిద్ధిక' అనే కథానాయిక పరిచయమవుతోంది. సాయికుమార్ .. సీత .. ఇంద్రజ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Thu, Oct 31, 2019, 03:51 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View