బాలకృష్ణ ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేశారనడంలో నిజం లేదు: 'రూలర్' నిర్మాత
Advertisement
బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మించాడు. డిఫరెంట్ లుక్స్ తో బాలకృష్ణ కనిపించనున్న ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేశారనీ .. ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాత వెనకాడలేదనే ప్రచారం జరిగింది.

ఈ విషయాన్ని గురించి తాజాగా నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు. 'బాలకృష్ణ గారు ఎప్పుడూ పారితోషికం గురించిన ఆలోచన చేయరు. మా సినిమా కోసం ఆయన ఎక్కువ పారితోషికం అడిగారనడంలో నిజం లేదు. అసలు మా మధ్య పారితోషికం గురించి చర్చలే జరగలేదు. ఆయన సహకారంతోనే చెప్పిన సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ - వేదిక కనిపించనున్న సంగతి తెలిసిందే.
Thu, Oct 31, 2019, 11:13 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View