సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement .b
*  రవితేజ తన 66వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తాజాగా అధికారికంగా ప్రకటించారు.
*  కొన్ని చిన్న సినిమాలు నిర్మాణంలో ఉండగానే క్రేజ్ తెచ్చుకుంటాయి. ఇదే కోవలో 'ప్రెజర్ కుక్కర్' చిత్రం కూడా బిజినెస్ వర్గాలలో క్రేజ్ తెచ్చుకుంది. సుజయ్- సుశీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ మంచి రేటుకి సొంతం చేసుకున్నట్టు సమాచారం.
*  యంగ్ హీరో నితిన్ కథానాయకుడుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న 'భీష్మ' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరింది. ఈ క్రమంలో తాజాగా నితిన్, రష్మిక జంటపై హైదరాబాదులో ఓ పాట చిత్రీకరణను పూర్తిచేశారు. నితిన్ సొంత బ్యానర్ పై నిర్మాణం అవుతున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీగా రూపొందుతోంది.  
Thu, Oct 31, 2019, 07:34 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View