గుండెపోటుతో సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత
Advertisement
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్, జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన గీతాంజలి.. సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు.

సీతారామ కల్యాణం సినిమా ద్వారా సినిమాల్లో అడుగుపెట్టారు. కలవారి కోడలు, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, దేవత, గూఢచారి 113, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి మృతి విషయం తెలిసి టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. చాలామంది ప్రముఖులు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు.
Thu, Oct 31, 2019, 06:51 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View