మొదటిసారిగా థ్రిల్లర్ జోనర్లో చేస్తున్నాను : హీరో రామ్
Advertisement .b
రామ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' సినిమాను ఈ రోజున లాంచ్ చేశారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను గురించి రామ్ మాట్లాడుతూ .. "కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఇది నా మూడో సినిమా. మా కాంబినేషన్లో సినిమా చాలా రోజుల క్రితమే ఖాయమైనప్పటికీ, టైటిల్ తో సహా అన్నీ సెట్ చేసుకున్న తరువాతనే సెట్స్ పైకి వెళ్లాలని భావించాము. ఈ కారణంగానే కొంత ఆలస్యమైంది.

ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగుతుంది. కెరియర్లో మొదటి సారిగా థ్రిల్లర్ జోనర్లో చేస్తున్నాను. మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వచ్చేనెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నాము" అని చెప్పుకొచ్చాడు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో నాయికలుగా మాళవిక శర్మ .. నివేద పేతురాజ్ కనిపించనున్నారు.
Wed, Oct 30, 2019, 05:03 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View