'ఖైదీ'కి సీక్వెల్ ఖాయమన్న కార్తీ
Advertisement .b
దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 25వ తేదీన 'ఖైదీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. చాలాకాలం తరువాత ఈ సినిమా కార్తీకి హిట్ తెచ్చిపెట్టింది. దాంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో కార్తీ మాట్లాడుతూ .. "తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడం ఆనందంగా వుంది. టీమ్ అంతా కూడా ఈ సినిమా కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈ సందడి పూర్తయిన తరువాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్ .. నేను కూర్చుని సీక్వెల్ ప్లాన్ చేస్తాము. ఇక ఈ సినిమా చూసి హీరో రవితేజ నాకు కాల్ చేసి అభినందించారు. కంటెంట్ ఆయనకి చాలా బాగా నచ్చిందట. ఈ తరహా కథను చేస్తానని ఆయన అనడం కూడా నాకు సంతోషాన్ని కలిగించింది" అని అన్నారు.
Wed, Oct 30, 2019, 04:32 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View