ఐదు రోజుల్లోనే 100 కోట్లను కొల్లగొట్టిన 'హౌస్ ఫుల్ 4'
Advertisement .b
దీపావళి కానుకగా ఈ నెల 26వ తేదీన 'హౌస్ ఫుల్ 4' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ .. కృతీ సనన్ .. బాబీ డియోల్ .. పూజా హెగ్డే .. రితేశ్ దేశ్ ముఖ్ .. కృతి కర్బందా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, వసూళ్ల పరంగా తన సత్తా చూపుతూ దూసుకుపోతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి 5 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. 5 రోజుల్లో ఈ సినిమా 111.82 కోట్లను వసూలు చేసింది. అక్షయ్ కుమార్ నుంచి ఈ ఏడాది వచ్చిన 'కేసరి' .. 'మిషన్ మంగళ్' 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి. తాజాగా 'హౌస్ ఫుల్ 4' కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. అక్షయ్ కుమార్ ఈ ఏడాది వరుస హిట్లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.
Wed, Oct 30, 2019, 02:38 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View