'ఆవిరి'లో ఆ పాత్ర కోసం చాలామందిని ట్రై చేశాను: దర్శకుడు రవిబాబు
Advertisement .b
కథాకథనాలపై రవిబాబుకి మంచి పట్టుంది. ఆయన టేకింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తాజా చిత్రంగా వచ్చేనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆవిరి' సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రవిబాబు మాట్లాడుతూ .. 'ఆవిరి' హారర్ సినిమా అని చెప్పలేం .. ఫ్యామిలీ థ్రిల్లర్ అంటే కరెక్ట్ గా ఉంటుంది.

ఈ సినిమాలో కీలకమైన పాత్ర నేనే చేయాలని ముందుగా అనుకోలేదు. వేరే ఎవరినైనా తీసుకుందామని ట్రై చేసినా కుదరలేదు. 'ఈ పాత్రను నువ్వు చేస్తేనే బాగుంటుందేమో' అని రైటర్ సత్యానంద్ గారు అంటే, అప్పుడు ఆ పాత్రను చేశాను. దిల్ రాజుగారితో మంచి పరిచయం వుంది. కలిసి సినిమా చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంతవరకూ కుదరలేదు. ఈ సినిమాను ఆయన రిలీజ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.
Wed, Oct 30, 2019, 02:08 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View