పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న అంజలి
Advertisement .b
అనుష్క ప్రధాన పాత్రధారిగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో 'సైలెన్స్' రూపొందింది. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమా 'నిశ్శబ్దం' టైటిల్ తో ప్రేక్షకులను పలకరించనుంది. కోన వెంకట్, విశ్వప్రసాద్ కలసి నిర్మించిన ఈ సినిమాలో అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర ఏమిటి? తెరపై ఎలా కనిపించనుంది? అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

కథ ప్రకారం ఈ సినిమా షూటింగు చాలావరకూ అమెరికాలో జరిగింది. అక్కడి పోలీస్ ఆఫీసర్ గా అంజలి కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం అంజలి గట్టిగానే కసరత్తు చేసి బరువు తగ్గిందని అంటున్నారు. ఈ తరహా పాత్రలో అంజలి కనిపించనుండటం ఇదే మొదటిసారి. ఆమె పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో మాధవన్ .. అవసరాల .. సుబ్బరాజు .. షాలినీ పాండే కనిపించనున్నారు.
Wed, Oct 30, 2019, 12:32 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View