'అసురన్' హిందీ రీమేక్ పై దృష్టిపెట్టిన షారుక్
Advertisement
షారుక్ ఖాన్ హిట్ అనే మాట విని చాలా కాలమైంది. విభిన్నమైన కథలను .. వైవిధ్య భరితమైన పాత్రలను ఎంచుకుని నానా రకాల ప్రయోగాలు చేశాడు. అయినా పరాజయాలు ఆయనను వెంటాడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన 'అసురన్' తమిళ సినిమా చూశాడట.

తమిళంలో ధనుశ్ హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంటూ దూసుకుపోతోంది. అలాంటి ఈ సినిమా షారుక్ ఖాన్ కి కూడా బాగా నచ్చేసిందట. దాంతో ఈ సినిమా హిందీ రీమేక్ లో చేయాలనే ఆలోచనలో ఆయన వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు రీమేక్ లో వెంకటేశ్ చేయనున్న సంగతి తెలిసిందే
Wed, Oct 30, 2019, 11:57 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View