నాగబాబు బర్త్‌ డే పార్టీ ఫొటోలు వైరల్!
Advertisement
సినీనటుడు, నిర్మాత నాగబాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఆయన కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నిన్న సాయంత్రం నాగబాబు జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసినట్లు తెలుస్తోంది. తన తండ్రి ముఖం మీద చిరునవ్వుల కోసం తాము ఏదైనా చేస్తామంటూ వరుణ్‌ తేజ్‌ ట్వీట్ చేశాడు. ఇంతటి అందమైన జీవితాన్ని అందించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు.

నాగబాబు మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సాయిధరమ్‌ తేజ్‌ ట్వీట్ చేశాడు. నిహారిక కూడా తన తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపింది. తన తండ్రికి నుదుటిపై ముద్దు పెడుతోన్న ఫొటో పోస్ట్ చేసి 'ఐ లవ్‌ యూ నాన్న' అని పేర్కొంది. ఈ ప్రపంచంలో తనకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది తన తండ్రేనని, ఆయన గత జన్మలో తన కొడుకుగా పుట్టుంటారని ట్వీట్ చేసింది. నాగబాబు బర్త్ డే పార్టీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
  
Wed, Oct 30, 2019, 11:23 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View