'రెడ్' మూవీకి పూజ.. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్
Advertisement .b
రామ్ తన తదుపరి చిత్రానికి దర్శకుడిగా కిషోర్ తిరుమలనే ఖరారు చేసుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమాకి 'రెడ్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కొంతసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. నవంబర్ 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక కథానాయికగా మాళవిక శర్మను .. మరో కథానాయికగా నివేద పేతురాజ్ ను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. డిఫరెంట్ లుక్ తో రామ్ కనిపించనున్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కెరియర్ పరంగా రామ్ కి 'రెడ్' 18వ సినిమాకాగా .. ఆయన కిషోర్ తిరుమలతో చేస్తున్న 3వ సినిమా ఇది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Wed, Oct 30, 2019, 10:50 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View