'శక్తి' సినిమా తీయద్దని రజనీకాంత్ ముందే చెప్పారు .. నేను వినలేదు: నిర్మాత అశ్వనీదత్
Advertisement
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై వచ్చిన భారీ చిత్రాలలో 'శక్తి' ఒకటి. 2011లో అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. ఆర్ధికంగా అశ్వనీదత్ కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఎన్టీఆర్ కెరియర్లోను భారీ పరాజయంగా ఈ సినిమా నిలిచిపోయింది.

తాజా ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. 'మెహర్ రమేశ్ చెప్పిన కథ నాకు నచ్చడంతో 'శక్తి' సినిమా చేయడానికి అంగీకరించాను. ఆ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే అనుకోకుండా రజనీకాంత్ ను కలిశాను. నేను చేస్తున్న సినిమాను గురించి ఆయనకి చెప్పాను. శక్తి పీఠాలపై సినిమా తీయవద్దని ఆయన నాకు చెప్పారు. కానీ నేను వినిపించుకోకుండా భారీ బడ్జెట్ తో ఆ సినిమాను తీశాను. ఫలితం మీ అందరికీ తెలిసిందే' అని అన్నారు.
Wed, Oct 30, 2019, 10:46 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View