అందుకే 'రాణి రుద్రమదేవి' చేయలేకపోయాను: విజయశాంతి
Advertisement
తెలుగు తెరపై అందమైన కథానాయికగా మాత్రమే కాదు .. పవర్ఫుల్ పాత్రలకి పెట్టింది పేరుగా విజయశాంతి కనిపిస్తారు. 13 ఏళ్ల గ్యాప్ తరువాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో ఆమె 'రాణి రుద్రమదేవి' సినిమా చేయాలనుకున్నారు. ఆ విషయాన్ని గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

"నేను సినిమాలకి దూరమై కొంతకాలం గడిచిన తరువాత రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను. రీ ఎంట్రీ పవర్ఫుల్ పాత్ర ద్వారానే జరగాలని భావించాను. 'రాణి రుద్రమదేవి' టైటిల్ తో రుద్రమదేవి చరిత్రను రూపొందించాలని నిర్ణయించుకున్నాను. నా సొంత బ్యానర్ పైనే నిర్మించాలనే ఉద్దేశంతో పరిశోధనలు పూర్తి చేసి కథను సిద్ధం చేసుకున్నాము. అయితే రాజకీయాలలో బిజీ కావడంతో, మరో వైపుకు దృష్టి మళ్లించకూడదనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.
Wed, Oct 30, 2019, 10:07 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View