వెంకటేశ్ 75వ సినిమా త్రివిక్రమ్ తో?
Advertisement
వెంకటేశ్ తాజా చిత్రంగా రూపొందిన 'వెంకీమామ' త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా తరువాత వెంకటేశ్ 'అసురన్' రీమేక్ లో చేయనున్నాడు. తమిళంలో ధనుశ్ చేసిన ఈ సినిమా దసరాకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది వెంకటేశ్ కి 74వ సినిమా అనీ, సురేశ్ ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతుందని సురేశ్ బాబు చెప్పారు.

దాంతో వెంకటేశ్ 75వ సినిమా ఏ దర్శకుడితో వుండనుందనే విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా తరుణ్ భాస్కర్ చెప్పాడు. కానీ వెంకటేశ్ 75వ సినిమా దర్శకుడిగా తాజాగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనే ఈ సినిమాకి దర్శకుడనే మాట ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.
Wed, Oct 30, 2019, 09:44 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View