మెగా హీరో కోసం విలాసవంతమైన సెట్
Advertisement
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా మారుతి 'ప్రతిరోజూ పండగే' సినిమాను రూపొందిస్తున్నాడు. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే న్యూయార్క్ షెడ్యూల్ ను ముగించుకుని వచ్చింది. ఆ షెడ్యూల్ తో టాకీ పార్టును పూర్తి చేసుకుని వచ్చిన ఈ సినిమా టీమ్, ఒకే ఒక్క పాట చిత్రీకరణతో షూటింగు పార్టును పూర్తిచేయనుంది.

తేజు - రాశి ఖన్నాపై చిత్రీకరించే ఈ పాట కోసం హైదరాబాద్ లో విలాసవంతమైన ఒక సెట్ ను వేస్తున్నారు. అందమైన ఈ సెట్ లో చిత్రీకరించే పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. 'సుప్రీమ్' తరువాత తేజు - రాశి ఖన్నా కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు వున్నాయి. సత్యరాజ్ .. రావు రమేశ్ .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా, డిసెంబర్ 20న విడుదల కానుంది.
Wed, Oct 30, 2019, 09:17 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View