సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement .b
*  ఆమధ్య 'ఆ..' చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు పొందిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కథానాయిక కాజల్ అగర్వాల్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా కాజల్ ఈ చిత్రనిర్మాణాన్ని విరమించుకున్నట్టు సమాచారం. స్క్రిప్టు సిద్ధమయ్యాక ఆ చిత్రం వర్కౌట్ కాదని లెక్కలు వేసుకోవడంతో ఆ ప్రాజక్టును డ్రాప్ చేసుకున్నారట.
*  తాజాగా కార్తీ హీరోగా రూపొందిన 'ఖైదీ' చిత్రం దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కి లక్కీ ఛాన్స్ తగిలింది. కార్తీ సోదరుడు, ప్రముఖ హీరో సూర్య తన తదుపరి చిత్రాన్ని లోకేశ్ తో చేయడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎంత మంచి వాడవురా' చిత్రంలో నటిస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా మరో చిత్రానికి సంతకం చేశాడు. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు నిర్మిస్తారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
Wed, Oct 30, 2019, 07:25 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View