'పెళ్లి చూపులు' హీరోయిన్ కి మరో ఛాన్స్ తగిలింది
29-10-2019 Tue 17:35
- 'పెళ్లి చూపులు'తో రీతూ వర్మకి మంచి పేరు
- ఆశించిన స్థాయిలో లేని అవకాశాలు
- త్వరలో నాగశౌర్య జోడీగా సెట్స్ పైకి

'పెళ్లి చూపులు' సినిమాతో తెలుగు తెరకి రీతూవర్మ పరిచయమైంది. ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్నా, రీతూ వర్మకి పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో తమిళ .. మలయాళ భాషా చిత్రాలపై ఆమె దృష్టిపెట్టింది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ జోడీగా ఒక సినిమా చేస్తోంది కూడా.
తాజాగా తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లినట్టుగా సమాచారం. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. నాగశౌర్య కథానాయకుడిగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయికగా రీతూవర్మను ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.
Advertisement 2
More Telugu News
చదరంగం బోర్డుపై ఆదాశర్మ కసరత్తులు... వీడియో ఇదిగో!
31 minutes ago

ఇన్నాళ్లు సంపాదించిన డబ్బు ఏమైందని చూసుకుంటే అయినవాళ్లే మోసం చేశారని అర్థమైంది: నటుడు రాజేంద్ర ప్రసాద్
46 minutes ago

Advertisement 3
తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్
1 hour ago

కమల్ సినిమాలో విలన్ గా ప్రముఖ నటుడు?
1 hour ago

మహిళపై యాసిడ్ పోసి పారిపోయిన దుండగుడు
2 hours ago

Advertisement 4