తెలుగు తెరకి మరో మలయాళ హీరోయిన్!
Advertisement
తెలుగు తెరపై ప్రయోగాలు చేయడానికి యువ దర్శకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. కొత్త కథల ద్వారా కొత్త నాయికలను పరిచయం చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.ఈ నేపథ్యంలో వరుసగా కొత్త హీరోయిన్లు తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. అలా తెలుగు తెరకి మరో మలయాళీ ముద్దుగుమ్మ పరిచయం కానుంది .. ఆ అమ్మాయి పేరే 'ఐమా సెబాస్టియన్'.

మలయాళంలో క్రితం ఏడాది చివర్లో వచ్చిన 'పడయోత్తం' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాలో కథానాయికగా చేసిన 'ఐమా'కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. తెలుగులోను కథానాయికగా 'ఐమా'నే తీసుకున్నారు. విను యజ్ఞ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోగా సుమంత్ చేయనున్నాడు. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
Tue, Oct 29, 2019, 04:33 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View