ఉత్కంఠను రేపే చిత్రంగా 'ఎస్ 5 - నో ఎంట్రీ
Advertisement
తారకరత్న - ప్రిన్స్ ప్రధాన పాత్రధారులుగా 'ఎస్ 5 - నో ఎంట్రీ' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ రోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. రాహుల్ - గౌతమ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సన్నీ కోమలపాటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఆయన మాట్లాడుతూ .."ప్రయాణంలో ఎగ్జిట్ అనేది లేకపోతే ఆ ప్రయాణం ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాము. ఈ సినిమా కోసం ట్రైన్ సెట్ వేయించాము. హీరో .. హీరోయిన్లు అని కాకుండా అంతా ముఖ్యమైన పాత్రధారులుగా కనిపిస్తారు. సంగీత దర్శకుడు మణిశర్మ .. ఫొటోగ్రాఫర్ అంజి ఈ సినిమాకి ప్రధానమైన బలంగా భావిస్తున్నాము. ఇండియాలో 'రెడ్ రేంజర్ విస్టా' కెమెరాతో షూట్ చేస్తున్న తొలి సినిమా మాదే కావడం సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.
Tue, Oct 29, 2019, 03:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View