బన్నీ 'ఐకాన్' ప్రాజెక్టు అటకెక్కిందట!
Advertisement .b
ప్రస్తుతం అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తున్నాడు. టాకీపార్టును పూర్తి చేసుకున్న ఈ  సినిమా, పాటల చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలోను .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలోను బన్నీ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

వేణు శ్రీరామ్ సినిమాకి 'ఐకాన్' అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు అటకెక్కినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ముందుగా లైన్ చెప్పినప్పుడు ఓకేనన్న అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ పూర్తి కథను చెప్పిన తరువాత అసంతృప్తిని వ్యక్తం చేశాడట. వేణు శ్రీరామ్ మెప్పించలేకపోయిన కారణంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని అంటున్నారు. ఇక సుకుమార్ తో సినిమా, మైత్రీ మూవీస్ కార్యాలయంలో రేపు పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.
Tue, Oct 29, 2019, 03:07 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View