నా అంచనాలను తలక్రిందులు చేస్తూ ఫ్లాప్ అయిన సినిమా అదే: దర్శకుడు రాఘవేంద్రరావు
Advertisement
రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు విజయాలను అందుకున్నాయి. ఎంతోమంది కథానాయకుల కెరియర్ ను ఆ సినిమాలు మలుపు తిప్పాయి. అలాంటి రాఘవేంద్రరావు తన అంచనాలను తలక్రిందులు చేసిన ఒక సినిమాను గురించి ప్రస్తావించారు.

'నిండు నూరేళ్లు' సినిమాను ఎంతో ఇష్టంతో తీశాను. కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తూ నేను ఎమోషనల్ అయిన సందర్భాలు వున్నాయి. జయసుధ .. మోహన్ బాబు .. సత్యనారాయణ తమ పాత్రల్లో జీవించారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నాను. కానీ ఘోరంగా పరాజయంపాలైంది. అంతగా నమ్మకం పెట్టుకున్న సినిమా ఓ మాదిరిగా కూడా ఆడకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలన చేసుకుని, ఆ తరువాత నుంచి అలాంటి పొరపాటు జరక్కుండా చూసుకున్నాను' అని చెప్పుకొచ్చారు.
Tue, Oct 29, 2019, 02:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View