బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్
Advertisement .b
ప్రస్తుతం బాలకృష్ణ .. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత బోయపాటితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో బోయపాటి బిజీగా వున్నాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరం కాగా, ఒక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ను అనుకుంటున్నారట. ఇప్పటికే 'జెర్సీ'.. 'జోడీ' సినిమాల ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
Tue, Oct 29, 2019, 12:56 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View