అలా మాట్లాడినందుకు తాప్సీ సారీ చెప్పింది: దర్శకుడు రాఘవేంద్రరావు
Advertisement
రాఘవేంద్రరావు సినిమాల్లోని పాటలు చాలా కలర్ ఫుల్ గా .. రొమాంటిక్ గా ఉంటాయి. మాస్ ఆడియన్స్ కి కిక్ ను ఇవ్వడం కోసం ఆయన హీరోయిన్స్ పై పండ్లు విసరడం వంటి దృశ్యాలను చిత్రీకరిస్తూ వుంటారు. అయితే ఈ మధ్య ఓ హిందీ ఛానల్ తో తాప్సీ మాట్లాడుతూ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించింది. ఆమె మాటలు రాఘవేంద్రరావును విమర్శించినట్టుగా వున్నాయనే వార్తలు షోషల్ మీడియాలో షికారు చేశాయి.

ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న ఆయనకి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఎదురవ్వగా తనదైన శైలిలో స్పందించారు. "తెలుగు తెరకి తాప్సీని పరిచయం చేసింది నేనే.' ఝుమ్మంది నాదం' సినిమాలో దిష్టి దీసే సీన్లో కొబ్బరి చిప్ప ఆమెకి తాకుతుంది. ఆ విషయాన్ని గురించే ఆమె మాట్లాడింది. ఆ తరువాత వచ్చి నన్ను కలిసింది .. సరదాగా మాత్రమే తాను ఆ విషయాన్ని ప్రస్తావించానంటూ సారీ చెప్పింది. ఎవరు ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ నేను పెద్దగా పట్టించుకోను" అని చెప్పుకొచ్చారు.
Tue, Oct 29, 2019, 12:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View