కార్తీ 'ఖైదీ' 50 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమట!
Advertisement .b
తమిళంలో కార్తీ చేసిన 'ఖైదీ' దీపావళి కానుకగా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేశారు. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ భాషల్లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. మౌత్ టాక్ తో ఊపందుకున్న వసూళ్లు పెరుగుతూ పోతున్నాయి. ఓవర్సీస్ లోను ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రెండు రోజుల్లో 14 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ వారంలో ఈ సినిమాకి పోటీగా నిలిచే సినిమాలు తెలుగులో ఏమీ రావడం లేదు. అందువలన ఇక్కడ వసూళ్ల జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలాకాలం తరువాత కార్తీకి హిట్ పడినందుకు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Tue, Oct 29, 2019, 10:46 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View