నేను గెడ్డం పెంచడం వెనుక సెంటిమెంట్ వుంది: దర్శకుడు రాఘవేంద్రరావు
Advertisement
తెలుగు సినిమా పాటల చిత్రీకరణను దర్శకుడు రాఘవేంద్రరావు కొత్త పుంతలు తొక్కించారు. పూలు .. పాలు .. పండ్లు ఉపయోగిస్తూ, పాటలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ప్రత్యేకత ఆయన సొంతం. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. "నేను తొలిసారిగా దర్శకత్వం వహించిన 'బాబు' యావరేజ్ గా ఆడింది. ఆ తరువాత తక్కువ బడ్జెట్ లో 28 రోజుల్లోనే 'జ్యోతి' సినిమాను పూర్తిచేశాను.

ఈ సినిమా బాగా ఆడితే తిరుపతి వచ్చి గెడ్డం ఇస్తాను అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఆ సినిమా బాగా ఆడింది. అప్పటి నుంచి సినిమాకి ముందు గెడ్డం పెంచడం .. సినిమా పూర్తి కాగానే తిరుపతిలో గెడ్డం ఇవ్వడం సెంటిమెంట్ గా మారింది. ఈ 45 ఏళ్లలో తిరుపతిలో తప్ప వేరెక్కడా గెడ్డం తీయలేదు. అంతే కాదు నా పేరు పక్కన 'B.A.' ఉండాలనే సెంటిమెంట్ కూడా వుంది. ఒకసారి నా పేరు పక్కన 'B.A.'అని వేయకపోవడం వలన ఆ సినిమా పరాజయంపాలైంది. అప్పటి నుంచి అది కూడా సెంటిమెంట్ గా వస్తోంది" అని చెప్పుకొచ్చారు.
Tue, Oct 29, 2019, 10:23 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View