నాకు మొదటి అవకాశం ఇచ్చింది శోభన్ బాబుగారే: దర్శకుడు రాఘవేంద్రరావు
Advertisement
తెలుగు తెరకు కొత్త కథలను .. తెలుగు సినిమాకి భారీ విజయాలను పరిచయం చేసిన దర్శకుడిగా రాఘవేంద్రరావుకు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. కథానాయికలను మరింత అందంగా చూపించడంలో ఆయన తరువాతే ఎవరైనా అనే పేరు వుంది. అలాంటి రాఘవేంద్రరావు, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తన కెరియర్ ను గురించిన విషయాలను ప్రస్తావించారు.

"చిత్రపరిశ్రమలోకి నేను అడుగు పెట్టి 50 సంవత్సరాలు అవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా నాలుగైదు ఏళ్లు గడిచాక దర్శకుడిగా మారాను. 'బాబు' సినిమాతో దర్శకుడిగా శోభన్ బాబు అవకాశం ఇచ్చారు. అంతకుముందు మా నాన్నగారు ఆయనతో రెండు సినిమాలు చేశారు. అందువలన శోభన్ బాబుగారితో పరిచయం వుంది. అయినా ఆయన నన్ను నమ్మి దర్శకుడిగా తొలి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం" అని చెప్పుకొచ్చారు.
Tue, Oct 29, 2019, 09:40 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View