'రెడ్' ఫస్టులుక్ తోనే అదరగొట్టేస్తున్న రామ్
Advertisement .b
రామ్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయాన్ని దక్కించుకుంది. రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా చెప్పినట్టుగానే, కొంతసేపటి క్రితం తన తాజా చిత్రానికి సంబంధించిన ఫస్టులుక్ పోస్టర్ ను రామ్ అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు.

ఈ సినిమాకి 'రెడ్' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టులుక్ ను వదిలిన రామ్ .. డిఫరెంట్ లుక్ తో అదరగొట్టేస్తున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నాడు. కెరియర్ పరంగా రామ్ కి ఇది 18వ సినిమా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్లో ఇంతకుముందు 'నేను శైలజ'.. 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.
Mon, Oct 28, 2019, 04:56 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View