రోజు రోజుకూ పెరుగుతున్న 'ఖైదీ' వసూళ్లు
Advertisement .b
దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని కార్తీ 'ఖైదీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. అయితే కార్తీ వరుస పరాజయాలతో వున్న కారణంగా ఈ సినిమాను అంతా లైట్ తీసుకున్నారు. కథానాయికగానీ .. పాటలుగాని ఉండవనే సరికే పట్టించుకోవడం మానేశారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 30 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది.

తొలి రోజునే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పుంజుకున్నాయి. మరుసటి రోజున ఈ సినిమా 90 లక్షల షేర్ ను వసూలు చేసింది. ఇక మూడవ రోజున 1.30 కోట్ల షేర్ ను సాధించింది. ఇలా 'ఖైదీ' వసూళ్లు రోజు రోజుకీ పెరుగుతూ వెళుతున్నాయి. తమిళంలోనే కాదు .. తెలుగులోను ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
Mon, Oct 28, 2019, 04:39 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View