'తోలుబొమ్మలాట' ట్రైలర్ రిలీజ్ డేట్
Advertisement
రాజేంద్రప్రసాద్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'మీ శ్రేయోభిలాషి' .. 'ఆ నలుగురు' సినిమాలు కనిపిస్తాయి. ఈ జాబితాలో తన తాజా చిత్రం చేరిపోవడం కూడా ఖాయమని ఆయన భావిస్తున్నారు. ఆ సినిమా పేరే 'తోలుబొమ్మలాట'. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా, కుటుంబాలు  .. బంధాలు .. అవసరాలు .. అవకాశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో .. దుర్గాప్రసాద్ మాగంటి నిర్మాణంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. నవంబర్ 1వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని తెలియపరుస్తూ వదిలిన స్పెషల్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mon, Oct 28, 2019, 04:08 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View