విడుదలకి సిద్ధమైన 'మీకు మాత్రమే చెప్తా'
Advertisement .b
విజయ్ దేవరకొండ నిర్మాతగా ఆయన సొంత బ్యానర్ నుంచి తొలి సినిమాగా 'మీకు మాత్రమే చెప్తా' రూపొందింది. షమ్మీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, తరుణ్ భాస్కర్ .. అనసూయ .. వాణి భోజన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను, నవంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. హీరోగా స్టార్ డమ్ ను అందుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో నిర్మాతగా మారడం ఒక విశేషమైతే, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా చేయడం మరో విశేషం. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
Mon, Oct 28, 2019, 03:53 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View