కొరటాల, ప్రభాస్ చర్చలు .. మరో సినిమాకి స్కెచ్
Advertisement .b
ప్రస్తుతం చిరంజీవి సినిమాకి సంబంధించిన పనులతో కొరటాల వున్నారు. వచ్చేనెలలో ఆయన చిరంజీవితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన చరణ్ తో చేయనున్నారు. ఈ విషయాన్ని చరణ్ ధ్రువీకరించాడు కూడా. చరణ్ సినిమా తరువాత ప్రభాస్ ప్రాజెక్టును కొరటాల పట్టాలెక్కించనున్నట్టు సమాచారం.

'సాహో' ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం ప్రభాస్ ను నిరాశ పరిచింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన, ఆ తరువాత సినిమా కొరటాలతో వుంటే బాగుంటుందని భావించాడట. ఈ కారణంగానే నిన్న దీపావళి రోజున కొరటాల - ప్రభాస్ కలవడం జరిగిందని అంటున్నారు. దర్శకుడిగా కొరటాల పరిచయమైంది ప్రభాస్ తో చేసిన 'మిర్చి'తోనే. అందువల్లనే ప్రభాస్ కి కొరటాల మాట ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.
Mon, Oct 28, 2019, 02:41 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View