'నిశ్శబ్దం' నుంచి టీజర్ వచ్చేస్తోంది
Advertisement .b
అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం' సినిమా రూపొందింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి నవంబర్ 7వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అనుష్క పాత్ర పూర్తి వైవిధ్యభరితంగా ఉండనుంది. చిత్రకారిణిగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది.

మాధవన్ .. అంజలి .. షాలినీపాండే .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రలను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. కోన ఫిల్మ్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.
Mon, Oct 28, 2019, 01:40 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View