వచ్చేనెల నుంచి సెట్స్ పైకి ప్రభాస్!
Advertisement
'సాహో' సినిమా ఫలితం ప్రభాస్ ను ఆలోచనలో పడేసింది. కథకి .. ఖర్చు బలాన్ని చేకూర్చలేదనే విషయం ఆయనకి అర్థమైపోయింది. దాంతో తన తదుపరి సినిమా విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు.

 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి సినిమా వుంది. ఈ సినిమా కథపై మరోసారి కూర్చున్న ప్రభాస్, బడ్జెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులను సూచించాడట. కథా కథనాల పరంగా ఆయన చేసిన సూచనలకి తగినట్టుగానే మార్పులను చేయడం పూర్తయింది. దాంతో వచ్చేనెలలో షూటింగుకి వెళ్లడానికి సన్నాహాలను మొదలెట్టినట్టుగా సమాచారం. అయితే కథలో మార్పులు చేయకముందు యూరప్ లో 20 రోజుల పాటు చిత్రీకరణ చేశారు. ఆ సన్నివేశాలను ఉంచుతారో .. లేపేస్తారో చూడాలి మరి.
Mon, Oct 28, 2019, 11:53 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View