విలన్ గా బన్నీతో తలపడనున్న విజయ్ సేతుపతి?
Advertisement .b
ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమా షూటింగుతో అల్లు అర్జున్ బిజీగా వున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, బన్నీ తదుపరి సినిమాకి సన్నాహాలు జరిగిపోతున్నాయి.

బన్నీ తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా వుంటుందట. ఈ పాత్రకి గాను తమిళ హీరో విజయ్ సేతుపతిని తీసుకోనున్నట్టు సమాచారం. తమిళనాట విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. అందువలన తమిళంలోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేసుకోవచ్చనే ఆలోచనలో వున్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు.
Mon, Oct 28, 2019, 11:28 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View