'అశ్వద్ధామ' వచ్చేది అప్పుడే
Advertisement .b
ప్రస్తుతం నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. ఒక వైపున బయట బ్యానర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే, సొంత బ్యానర్లోను సినిమాలు చేస్తున్నాడు. అలా ఆయన సొంత బ్యానర్లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'అశ్వద్ధామ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'దీపావళి' పండుగ సందర్భంగా అదే టైటిల్ ను ఖరారు చేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

ఊయలలో వున్న పసికందు వేలును పట్టుకున్న దృశ్యం ఈ పోస్టర్లో కనిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Mon, Oct 28, 2019, 11:07 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View