ఒక రేంజ్ లో దూసుకుపోతున్న 'రాములో రాములా' పాట
Advertisement
త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక్కో పాటను వదులుతూ వస్తున్నారు.

ముందుగా ఈ సినిమా నుంచి వచ్చిన 'సామజ వర గమన' అనే క్లాస్ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. 50 మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'రాములో రాములా' అనే మాస్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మాస్ బీట్ ఒక ఊపు ఊపేస్తోంది. 24 గంటల్లోనే 8.3 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ ను రాబట్టుకున్న దక్షిణాది పాటగా కొత్త రికార్డును నమోదు చేసింది. వ్యూస్ పరంగా 'సామజ వర గమన' సాంగ్ ను తక్కువ రోజుల్లోనే 'రాములో రాములా' పాట బీట్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Mon, Oct 28, 2019, 09:53 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View