కొరటాల తరువాత ఛాన్స్ త్రివిక్రమ్ కే ఇచ్చిన చిరూ?
Advertisement .b
చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలోనే కొరటాల బిజీగా వున్నాడు. ఆ సినిమాలో పాత్రకి తగినట్టుగా చిరంజీవి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం.

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలనుందనే కోరికను చిరూ చాలా వేదికలపై వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య చిరంజీవికి త్రివిక్రమ్ ఒక కథ చెప్పడం .. అది చిరంజీవికి నచ్చేయడం జరిగిపోయాయట. ఆ కథ పూర్తి స్క్రిప్ట్ ను కూడా ఇటీవల త్రివిక్రమ్ పూర్తి చేశాడట. త్వరలో ఆ స్క్రిప్ట్ ను చిరంజీవికి వినిపించనున్నాడనీ, చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే, కొరటాల మూవీ తరువాత ఆయన చేయనున్న సినిమా ఇదే అవుతుందని అంటున్నారు.
Mon, Oct 28, 2019, 09:21 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View