లీకే నిజమైంది.. బిగ్‌బాస్ నుంచి శివజ్యోతి అవుట్.. ఫైనల్ వీరి మధ్యే!
Advertisement
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ హౌస్ నుంచి శివజ్యోతి ఎలిమినేట్ కాబోతోందంటూ ముందుగానే వచ్చిన లీకులు నిజమయ్యాయి. శివజ్యోతి ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. నిజానికి వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా హౌస్ నుంచి బయటకు వెళ్తాడని భావించారు. ఎందుకంటే శివజ్యోతి వెళ్లిపోతే హౌస్‌లో శ్రీముఖి మాత్రమే మిగులుతుందని, అంతమంది మగాళ్ల మధ్య ఆమెను ఉంచరని భావించారు. అయితే, అందరి అంచనాలు తప్పయ్యాయి. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అలీ సేఫ్ కాగా, వంద రోజులు హౌస్‌లో ఉన్న శివజ్యోతి ఎలిమినేట్ అయింది.

శివజ్యోతి ఎలిమినేషన్‌తో గ్రాండ్ ఫినాలేకు ముందు టాప్-5లో శ్రీముఖి, బాబా భాస్కర్‌, అలీ రెజా, వరుణ్‌, రాహుల్ మిగిలారు. కాగా, ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండ సందడి చేశాడు. విజయ్ నిర్మాతగా రూపొందిన ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన విజయ్ అండ్ టీం కాసేపు సందడి చేసింది.
Mon, Oct 28, 2019, 07:00 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View